మెగాస్టార్ ఫై మెగా ప్రేమను వ్యక్తం చేసిన నటి రాధ

చిరంజీవి – రాధ జోడి లో ఎన్నో సినిమాలు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా వీరిద్దరి డాన్స్ అప్పట్లో థియేటర్స్ లలో మోత మోగించేవి. ఇప్పటికే వీరిద్దరి కలయికలో సూపర్ హిట్ అయినా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అందుకే వీరిద్దరి జోడి మెగా జోడి అనేవారు. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ తో బిజీ గా ఉన్న రాధా..ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా తన అభిమానాన్ని , ప్రేమను తెలియజేసింది.

“సినిమా ఇండస్ట్రీలో ఓ జోడీ సూపర్ హిట్టయింది అంటే… ఓ నటుడి గురించి ఆలోచిస్తే, అతడికి జోడీ అయిన ఆ నటీమణి కూడా గుర్తుకురావాలి. అలాగే ఆ నటీమణి గురించి ఆలోచిస్తే అతడికి సరిజోడీ అయిన ఆ నటుడు కూడా గుర్తుకు రావాలి. అలాంటి జోడీయే మాది. ఇప్పటికీ నన్ను అచ్చెరువొందించే అంశం ఒకటుంది. అభిమానులు నన్ను ఎప్పుడు కలిసినా… చిరంజీవి-రాధ పాటలు సూపర్బ్ అంటారు.

మా మధ్య అమోఘమైన కెమిస్ట్రీ ఉండేది. అంతకుమించిన అవగాహన ఉండేది. మా జోడీ ఎంతో ప్రజాదరణ పొందడానికి కారణం ఇదే. గొప్ప నటుడు కంటే కూడా చిరంజీవి అద్వితీయమైన డ్యాన్సర్. అంతకుమించి అసమాన వ్యక్తిత్వం ఆయన సొంతం. ప్రియమైన చిరంజీవి గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, మీ తదుపరి చిత్రాలు బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ రాధ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ ను మెగా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.