ఝార్ఖండ్‌లో ప్రజలను వణికిస్తున్న ఏనుగు

ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఓ ఏనుగు ప్రజలను వణికిస్తోంది. అడుగు బయటపెట్టాలంటే గజగజలాడిపోతున్నారు. రెండు వారాల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మందిని బలి తీసుకుంది. ఒక రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది. దీంతో ఇటకీ బ్లాకులో 144 సెక్షన్ విధించారు. ఇలాంటి దుర్ఘటనలు మరిన్ని జరగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాంచీ డివిజనల్ అటవీ అధికారులు తెలిపారు. మరోవైపు, ఐదుగురికి మంచి జనం గుమికూడకుండా రాంచీ జిల్లాలోని ఇటకీ బ్లాకులో 144 సెక్షన్‌ విధించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఏనుగు దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్టు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికుమార్ తెలిపారు. హజారీబాగ్‌, రామ్‌గఢ్‌, చతరా, లోహర్‌దగా, రాంచీ జిల్లాల్లో 16 మందిని చంపిన ఏనుగును అడవుల్లోకి తరలించేందుకు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం బాంకుడా జిల్లా నుంచి నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శశికుమార్‌ సామంతా చెప్పుకొచ్చారు.