ఎట్టకేలకు ఏజెంట్ నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రోమో వచ్చేసింది. ఏజెంట్ నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో ను మేకర్స్ మంగళవారం రిలీజ్ చేసి సంతోష పెట్టారు. అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టి చాలాకాలం అవుతున్న ఇంతవరకు అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు. అఖిల్ నటించిన గత చిత్రం మోస్ట్ బ్యాచ్లర్ సైతం యావరేజ్ తోనే సరిపెట్టుకుంది. దీంతో ఏజెంట్ మూవీ ఫై అందర్నీలో ఆశలు పెరిగాయి. కానీ ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టడం , రీషూట్ జరుపుకోవడం వంటివి జరిగిపోయాయి. కానీ సినిమా తాలూకా ప్రమోషన్ మాత్రం ఇంకా మొదలుపెట్టుకోలేదని సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు.

ఈ క్రమంలో మేకర్స్ సినిమాలోని ఫస్ట్ సాంగ్ తాలూకా ప్రోమో రిలీజ్ చేసి వారిని కాస్త కూల్ చేసారు. ‘మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే’ అంటూ సాగే ఈ పాట తాలూకా ప్రోమో ను రిలీజ్ చేసిన మేకర్స్..ఈరోజు రాత్రి 7:03 గంటలకు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి హిప్హాప్ తమిళ సంగీతం సమకూరుస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాక్షి వైద్య కథానాయికగా నటించింది. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. దాదాపు రూ.90కోట్ల బడ్జెట్తో ఈ మూవీ రూపొందింది.

YouTube video