కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ : కాంగ్రెస్ లో చేరేందుకు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్

prashant kishor not joins congress
prashant kishor not joins congress

నిన్నటి వరకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నారని..దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కాగా, కాంగ్రెస్‌‌ పార్టీలో చేరేందుకు పీకే ఇప్పటికే ఆ పార్టీ చీఫ్‌‌ సోనియాగాంధీ, ముఖ్య నేత రాహుల్‌‌ గాంధీతో పలుమార్లు భేటీ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్‌‌లోకి ఎంట్రీ ఇస్తారనే చర్చ సాగుతుండగా.. ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా షాక్‌కు గురయ్యారు. రెండు రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. శని , ఆదివారాలు రెండు రోజులు ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్ ఉండి..కేసీఆర్ తో చర్చలు జరిపారు. కానీ సడెన్ గా ఈరోజు కాంగ్రెస్ లో పార్టీ లో చేరడం లేదనే వార్త వైరల్ గా మారింది. దీనికి కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.