లండన్ లో ఓ ఏటీఎం నుండి డబుల్ అమౌంట్ ..డ్రా చేసేందుకు పోటీపడ్డ జనాలు

అప్పుడప్పుడు ఏటీఎం నుండి మనీ డ్రా చేసే టైములో వందకు రెండువందల , వెయ్యి కి రెండు వేలు వస్తుంటాయి. ఇలా పలు ప్రాంతాలలో టెక్నీకల్ సమస్య తో ఇలాంటివి జరుగుతుంటాయి. తాజాగా లండన్ లో కూడా ఇదే జరిగింది. ఏటీఎం నుండి కొట్టిన అమౌంట్ కు డబుల్ ఎమౌంట్ రావడంతో ఒక్కసారిగా డ్రా చేసుకునేందుకు జనాలు పోటీ పడ్డారు.

లండన్‌లోని ఈస్ట్ హ్యామ్ హై స్ట్రీట్‌లోని ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాని కారణంగా కస్టమర్ ఎంటర్ చేసిన దానితో పోలిస్తే రెండింతలు ఎక్కువ డబ్బు ఇవ్వడం ప్రారంభించింది. విషయం తెలిసి జనాలు ఏటీఎంకు క్యూ కట్టారు. చూస్తుండగా ఏటీఎం జనాలతో కిటకిటలాడిపోయింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. 9 సెకడ్ల ఈ వీడియో కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ సంపాదించుకుంది.