కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి కీలక పదవి

బిజెపి కి రాజీనామా చేసి..కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి అధిష్టానం కీలక పదవి అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ ని నియమించగా..ఈ కమిటీలో విజయశాంతికి స్థానం కల్పించారు. ప్రచార కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్‌గా, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా విజయశాంతికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. 15 మందికి కన్వీనర్ పోస్టులు ఇచ్చారు. మహేశ్వరం టికెట్ ఆశించిన బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాతకి కన్వీనర్ పోస్ట్ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ.

ఇక నవంబర్ 15న బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవికి రాజీనామా చేసిన విజయశాంతి.. నిన్న (నవంబర్ 17) హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో.. టీపీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్ రావు థాక్రే, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.