కెరీర్ లోనే క్రేజీ మూవీ!

నిఖిల్ కొత్త ఫార్ములా

Hero Nikhil
Hero Nikhil

నిఖిల్ తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ వస్తున్న నిఖిల్ ఈ చిత్రం కూడా అలాగే ఉంటుందని.. హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ సినిమా సాగుతుందట .

అయితే ఈ మెమరీ లాస్ అనేది సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందట.

ఇప్పటికే ఈ ఫార్ములా మీద తెలుగులో కొన్ని చిత్రాలు వచ్చినా ఈ కథ కొత్తగా ఉంటుందట.

అంతేకాదు ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయనుండగా గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/