‘రాజా విక్రమార్క’గా రాబోతున్న కార్తికేయ

 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల ‘ఆర్ఎక్స్ 100’తో ప్రేక్షకుల మనసు దోచిన యువ కథానాయకుడు కార్తికేయ. అమ్మాయిలు అతడితో ప్రేమలో పడ్డారు. అబ్బాయిలు లవ్ ఫెయిల్యూర్ సన్నివేశాల్లో అతడి బాధను ఫీలయ్యారు. పాత్ర, అందులో భావోద్వేగాలు కనిపించేలా నటించడం కార్తికేయ ప్రత్యేకత. జయాపజయాలకు అతీతంగా ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. కార్తికేయ డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తారని… భావోద్వేగాలు అద్భుతంగా పలికిస్తారని ప్రశంసలు అందుకున్నారు.గ్యాంగ్ లీడర్’లో స్టయిలిష్ విలన్‌గానూ మెప్పించారు.  ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా కార్తికేయ 7వచిత్రమిది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగాపరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి రాజావిక్రమార్క’ టైటిల్ ఖరారు చేశారు. అలాగే, సినిమాలో హీరో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. టైటిల్ ప్రకటనతో పాటు సినిమా ఫస్ట్ లుక్పోస్టర్ను ‘అర్జున్ రెడ్డి’,’కబీర్ సింగ్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆదివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు.  తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/devotional/ . 

Read more

‘చావు క‌బురు చ‌ల్లాగా’.

వ‌ర్కింగ్ స్టిల్స్‌ విడుదల గీతాఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2  బ్యానర్ పై ఇంటిలిజెంట్ ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాత‌గా, కార్తికేయ హీరోగా , ల‌క్కిబ్యూటి లావ‌ణ్య

Read more

కెరీర్ లోనే క్రేజీ మూవీ!

నిఖిల్ కొత్త ఫార్ములా నిఖిల్ తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ వస్తున్న

Read more