ఏపిలో ఐదు వందలు దాటిన కరోనా కేసులు

కొత్తగా 19 కేసులు వెలుగులోకి

corona virus
corona virus

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు మరింతగా పెరిగాయి. నిన్న సాయంత్రం నుండి జరిపిన పరీక్షల్లో కొత్తగా 19 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 502 కు చేరింది. కాగా కొత్తగా నమోదయిన కేసులలో పశ్చిమ గోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదు అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 118 కరోనా కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 97 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/