కేక పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్ న్యూ లుక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా పవన్ లుక్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. రెడ్ కలర్ టీషర్ట్…బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్..కాళ్లకి వైట్ షూస్ ధరించి పవన్ కళ్యాణ్ కేక పుట్టిస్తున్నాడు. ఈ లుక్ లో పవన్ పూర్తి యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ను ఈ మధ్య కాలంలో ఇలాంటి లుక్ లో కనిపించలేదు.

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో సోషియా ఫాంటసీ చిత్రం ‘హరిహరవీరమల్లు’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా చిత్రీకరణ ప్లానింగ్ ప్రకారం జరగడం లేదు. గత రెండు నెలలు గా షూటింగ్ కి దూరంగా ఉన్నారు పవన్. ఈ క్రమంలో అనుకోకుండా వ్యక్తిగత పనుల మీద అమెరికా టూర్ వెళ్లడంతో మరింత ఆలస్యమవుతోంది. తాజాగా పవన్ USA నుండి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. తిరిగి యాధవిధిగా షూటింగ్ కి సమయాత్తం అవుతున్నారు. దీనిలో భాగంగా షూట్ కి సంబంధించి వర్క్ షాప్స్ చేయాల్సి రావడంతో ఆ పనుల్లో బిజీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ తాజా లుక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.