క్యూట్ హీరోయిన్ చిన్ననాటి ఫొటో వైరల్
అభిమానులందరూ ఫిదా !

అనుపమ పరమేశ్వరన్. …’అఆ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అద్భుతమైన నటనతో క్యూట్ లుక్స్ తో లక్షలాది అభిమానుల అభిమానాన్ని చూరగొంటుంది.
ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే అనుపమ విపరీతమైన క్రేజ్ తో వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ వస్తుంది.
మొదటి సినిమా నుండి సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటుంది అనుపమ
తాజాగా అనుపమ చిన్నప్పుడు శ్రీ కృష్ణుడి గెటప్ లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫొటోలో చిన్ననాటి అనుపమ క్యూట్ గా ముస్తాబై ఫోటోకి మంచి స్మైల్ తో లుక్కిచ్చింది.
ఈ లాక్ డౌన్ సమయంలో ఇలా ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది
ఆ ఫోటో చూసినవాళ్లంతా ఫిదా అయిపోతున్నారు
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com