ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ తో సీపీఎం నేత‌ల భేటీ

CM KCR's Maharashtra tour canceled
CM KCR

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో తెలంగాణ సీపీఎం నేత‌లు భేటీఅయ్యారు. ఈ స‌మావేశంలో మునుగోడు ఉప ఎన్నిక‌, రాజ‌కీయ అంశాల‌తో పాటు బీజేపీ వైఖ‌రిపై ప్ర‌ధానంగా చ‌ర్చిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌లో ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీకి సీపీఎం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు సీపీఎం మద్దతు ప్రకటించిన తర్వాత తొలిసారి సీఎంతో సమావేశం కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు తాజా రాజకీయాలపైన వీరు చర్చిస్తున్నారు. బిజెపి కి వ్యతిరేకంగా కేసీఆర్‌ చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి, ఈ ఎన్నికలో తమ మద్దతు టిఆర్ఎస్ పార్టీకే ఉంటుందని మునుగోడు సభకు ముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ ఒక్క ఎన్నికలో మాత్రమే టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని సమావేశంలో తెలిపారు. దీంతో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్​తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామాతో.. ఉపఎన్నిక అనివార్యమైంది. అందులోనూ.. రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్​ను వీడి బిజెపిలో చేరటంతో.. రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ vs టిఆర్ఎస్ గా ఉండే ఈ నియోజకవర్గం..ఇప్పుడు బిజెపి vs టిఆర్ఎస్ గా మారింది.