సిఎం జ‌గ‌న్‌కు మాన‌వ‌త్వ‌మే లేదా?: లోకేశ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసి తీర‌తామ‌ని వెల్ల‌డి

nara lokesh
nara lokesh

అమరావతిః టిడిపి అగ్ర నేత నారా లోకేశ్ గుంటూరు జిల్లా తెనాలిలో టిడిపి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు అయిన అన్నా క్యాంటీన్‌ను పోలీసులు అడ్డుకున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్నం తినే వారెవ్వ‌రూ అన్నా క్యాంటీన్‌ను అడ్డుకోర‌ని ఆయ‌న ఘాటు వ్యాఖ్య చేశారు. ఇప్ప‌టికే నందిగామ‌, మంగ‌ళ‌గిరి, కుప్పంల‌లో త‌మ పార్టీ ఏర్పాటు చేయ‌త‌ల‌పెట్టిన అన్నా క్యాంటీన్ల‌ను అడ్డుకున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తాజాగా తెనాలిలోనూ అన్నా క్యాంటీన్‌ను అడ్డుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సిఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అస‌లు మాన‌వ‌త్వ‌మే లేదా? అని కూడా నారా లోకేశ్ ప్ర‌శ్నించారు. తెనాలిలో కేవలం అన్నా క్యాంటీన్‌ను అడ్డుకునేందుకే పోలీసు ప‌హారా పెట్ట‌డం దారుణ‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసి తీర‌తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అన్నా క్యాంటీన్ల‌తో రాష్ట్రంలోని నిరుపేద‌ల ఆక‌లి తీరుస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/