ప్రజలే కేంద్ర బిందువులుగా పనిచేయాలి

అసిస్టెంట్‌ రిజిస్టార్లకు సూచించిన మంత్రి

niranjan reddy
niranjan reddy

హైదరాబాద్‌: నా దగ్గర కానిస్టేబుల్‌గా పనిచేసిన వ్యక్తి గ్రూప్‌ 2 అధికారి అయ్యారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. గ్రూప్‌ 2 ద్వారా సహకార శాఖలో అసిస్టెంట్‌ రిజిస్టార్లుగా ఎంపికయిన అధికారులకు రాజేంద్రనగర్‌లోని సహకార యాజమాన్య సంస్థలో శిక్షణా శిభిరాన్ని నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మీరు ఎంత స్వచ్ఛంగా ఉద్యోగంలో చేరుతున్నారో పదవీ విరమణ వరకు అదే స్వచ్ఛతతో పనిచేయాలని మంత్రి కోరారు. ప్రజలే కేంద్ర బిందువులుగా ఆలోచించి పనిచేయాలని పిలుపునిచ్చారు. లక్ష్యం మీదే దృష్టి ఉంటే ఏదీ అసాధ్యం కాదని స్పష్టం చేశారు. శిక్షణను శ్రద్దగా పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వాలు పట్టుబట్టి పిల్లలను విద్య వైపు తీసుకెళ్లిన పరిస్థితి దేశంలో ఎక్కడ లేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాత్రం ప్రజలను ఆ దిశగా అడుగులు వేయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

తాజ ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/