ఢిల్లీకి బయల్దేరిన సిఎం జగన్
ప్రధానితో పలు అంశాలపై చర్చించనున్న జగన్

అమరావతి: ఏపి సిఎం జగన్ 10 మంది బృందంతో ఢిల్లీకి బయలుదేరారు. రేపు నదీ జలాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి సంబంధిత అధికారులకు జగన్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మరోవైపు ప్రధాని మోడిని కలిసేందుకు జగన్ కు అపాయింట్ మెంట్ ఖరారైంది. మోడితో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై జగన్ చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ లోకి వైఎస్‌ఆర్‌సిపి చేరబోతోందనే వార్తలతో జగన్ పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/