కేసీఆర్ ను జగన్ కలవడం ఫై నారాయణ కీలక వ్యాఖ్యలు

Jagan reached KCR’s residence

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బేగం పేట్ కు చేరుకున్న జగన్…నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీశారు. దాదాపు 45 నిమిషాల పాటు కేసీఆర్ తో సమావేశమైన జగన్..ఆ తర్వాత లోటస్ పాండ్ కు వెళ్లి తల్లి విజయమ్మను కలిశారు.అయితే కేసీఆర్ ను జగన్ కలవడం ఫై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఎన్నికల్లో సాయం‌ కోసమే జగన్.. కేసీఆర్ దగ్గరకి వచ్చారని అన్నారు. కేసీఆర్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రయత్నించి జగన్ విఫలమయ్యారని.. అందులో భాగంగానే పోలింగ్ రోజు నాగార్జున సాగర్‌లో లేని గొడవ సృష్టించారని నారాయణ అన్నారు. ఆ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తన ఇంట్లో తన చెల్లెలితో గొడవలు పెట్టుకొని తన చేతులతో తానే నష్టం కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. ఇంట్లో కుంపటి వ్యాఖ్యలు చేసి.. జగన్ తన ఓటమిని తానే ఒప్పుకున్నారని అన్నారు. ఇంట్లో గొడవలు సృష్టించుకుని ఇతరులను నిందిస్తే లాభం ఏంటని నిలదీశారు. చెల్లెలిని, బాబాయ్‌ను దూరం చేసుకున్నారని.. అలాగే అధికారానికి‌ కూడా దూరమవుతారని నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.