కేసీఆర్.. దమ్ముంటే ఓయూకి వెళ్లి ఓట్లు అడగు – నారాయణ సవాల్

cpi-narayana

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో పర్యటించిన సీపీఐ నారాయణ..సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చావు నోట్లో తల పెట్టాను అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖమ్మం ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని జ్యూస్ తాగిన తర్వాత.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆగ్రహిస్తే మాట మార్చిన విషయం కేసీఆర్ మర్చిపోతే ఎలా అని విమర్శించారు.

కొత్తగూడెం లో వనమా కుమారుడి అరాచకాలు చూసి కూడా బీఆర్ఎస్ ను వెనుకేసుకు రావటం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని తేల్చి చెప్పారు. ఇక కొత్తగూడెం బరిలో సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, అధికార బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వర రావు, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీఆర్‌ఎస్ రెబెల్ జలగం వెంకట్ రావు బరిలో ఉన్నారు.