కోనసీమ అల్లర్ల వెనుక టీడీపీ- జనసేన పార్టీల హస్తం – హోంమంత్రి తానేటి వనిత

కోససీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఫై అమలాపురంలో కోనసీమ సాధన సమితి ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వందలాది మంది అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ప్రభుత్వ వాహనాలతో పాటు, పలు ప్రవైట్ వాహనాలు దగ్దమయ్యాయి. ఈ ఆందోలన వెనుక టీడీపీ, జనసేన పార్టీల హస్తం ఉందంటూ హోంమంత్రి తానేటి వనిత సంచలన వ్యాఖ్యలు చేసారు.
కోనసీమ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన ఉన్నాయని ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయని వెల్లడించారు. జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సబబు కాదని అన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేసిందనకు గర్వించాలని అన్నారు. అలాగే ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ సైతం దీనిపై స్పందించారు. కొన్ని సంఘవిద్రోహ శక్తులు అశాంతిని రేకేత్తించాయి. ఈ ఘటనలతో నేను సిగ్గుపడుతున్నా. చంద్రబాబు సైతం అంబేడ్కర్ జిల్లా పేరు పెడతా అని చెప్పారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మీడియా ముందుకు రావాలి. వెనక ఉండి రెచ్చగొట్టడం మానుకోవాలి.
బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదు. పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు. అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం మన అదృష్టం. ఉద్యమకారులు సంయమనం పాటించండి. అంబేడ్కర్ వల్లనే మన దేశంలో ప్రజాస్వామ్యం వర్దిల్లుతోంది. మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన పాకిస్తాన్‌లో రాజ్యాంగం ఫెయిల్ అయిందని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు.