రాజ్యసభ ఎన్నికలు వాయిదా

31 తరువాత పరిస్థితిని సమీక్షించి ఎన్నికలు.. ఈసీ

election commission of india
election commission of india

దిల్లీ: దేశంలో రాజ్యసభకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. కాగా రాజ్యసభకు ఖాళీగా ఉన్న 55 సీట్లలో , 37 ఏకగ్రీవాలు కాగా మిగిలిన 18 స్థానాలకు ఈ నెల 26 వ తేది ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. కాని ప్రస్తుతం దేశంలో కరోనా భయంతో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ పరిస్థితులో జనం ఒకే దగ్గర గుమి కూడడం అంత మంచిది కాదని, ఎన్నికల కోసం రాజకీయ నాయకులు అంతా ఒకే దగ్గర ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈనెల 31 వరకు వాయిదా వేసి, పరిస్థితులు అనుకూలించిన తరువాత ఎన్నికలు జరుపుతామని ఈసీ వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/