ఈటెల కు షాక్ ఇచ్చిన సీపీఐ, సీపీఎం పార్టీలు

హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు సీపీఐ, సీపీఎం పార్టీ లు పెద్ద షాక్ ఇచ్చాయి. ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో బరిలో నిల్చున్న పార్టీలు తమ ప్రచారంలో బిజీ అయ్యారు. ముందు నుండి కూడా బిజెపి , తెరాస పార్టీ లు తమ ప్రచారం కొనసాగిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్షన్స్ లో ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఓడించాలని కసిగా ఉన్న తెరాస…దానికి తగ్గట్లే వ్యూహాలు చేస్తుంది.

ఈ క్రమంలో లెఫ్ట్ పార్టీలైన సిపిఎం మరియు సీపీఐ లు… ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి… మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈటెల కు షాక్ ఇచ్చారు. నిన్నటి వరకు ఈటెల కు వారి మద్దతు ఉంటుందని అంత భావించారు. కానీ సడెన్ గా వీరు అధికార పార్టీ వైపు మొగ్గు చూపించడం తో బిజెపి శ్రేణులు షాక్ లో పడ్డారు. ఇదిలా ఉంటె ఈటల రాజేందర్‌లో కనపడని అపరిచితుడున్నాడని.. పైకి కనిపించేంత నీతిమంతుడు కాదని.. విజయలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్‌ నిర్వాహకురాలు కన్న శివకుమారి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం హుజూరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు తనకు తీరని అన్యాయం చేశారని, తీవ్రంగా వేధించారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ముడుపులు ఇవ్వలేదని కక్షగట్టి తన జీవితాన్ని రోడ్డుపాలుచేశాడని ఆవేదన వ్యక్తంచేశారు.