గణేష్ ఉత్సవాల అనుమతి ఆన్ లైన్ ద్వారా తీసుకోవాలి – డీఐజీ ఏవీ రంగనాధ్

మరో నాల్గు రోజుల్లో గణేష్ ఉత్సవాలు మొదలుకాబోతున్నాయి. గత ఏడాది కరోనా తీవ్రత వల్ల ఉత్సవాలు లేకుండా అయిపోయాయి. ఈసారి కరోనా ఉదృతి తగ్గడం తో ప్రభుత్వం గణేష్ ఉత్సవాలకు అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రజలంతా గణేష్ ఉత్సవాల ఏర్పాటులో బిజీ అయ్యారు. విగ్రహాలను ఆర్డర్ ఇవ్వడం , మండపాలను సిద్ధం చేయడం , చందాలను అడగడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ శాఖ ద్వారా తీసుకోవాల్సిన అనుమతులను ఆన్ లైన్ ద్వారానే ఇవ్వనున్నట్లు డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు.

తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న http://policeportal.tspolice.gov.in ద్వారా అనుమతులు ఇస్తున్నట్లు , మండపాల నిర్వాహకులు వెబ్ సైట్ ద్వారా వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు వాటిని పరిశీలించి గణేష్ మండపాల ఏర్పాటుతో పాటు నిమజ్జన అనుమతులు ఆన్ లైన్ ద్వారా ఇస్తారని డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు. మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. అలాగే గణేష్ మండపాల వద్ద, నిమజ్జన శోభాయాత్రలో డి.జె.లకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు.