ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుదల..ఆస్ప‌త్రిలో చేరిన 14 మంది పిల్ల‌లు

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుదల..ఆస్ప‌త్రిలో చేరిన 14 మంది పిల్ల‌లు

న్యూఢిల్లీ: మరోసారి ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. శ‌నివారం ఉద‌యం 14 మంది పిల్ల‌లు క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేరారు. ఇందులో 12 మందిని క‌ళావ‌తి స‌ర‌న్ ఆస్ప‌త్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా ఢిల్లీలో 53 మంది కొవిడ్‌తో ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు వైద్య వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కాగా, శుక్ర‌వారం ఒక్క‌రోజే ఢిల్లీలో కొత్త‌గా 366 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.95 శాతంగా ఉంది. గ‌త కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో పాజిటివ్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే పిల్ల‌ల‌కు క‌రోనా సోక‌డంతో.. విద్యాశాఖ అధికారులు స్పందించారు. అవ‌స‌ర‌మైతేనే స్కూళ్ల‌ను బంద్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/