బండ్ల గణేశ్ పై విజయసాయిరెడ్డి విమర్శలు

ఆకులు.. వక్కలు.. పక్కలు.. ఇదేగా నీ బతుకు..విజయసాయి కౌంటర్

అమరావతి: వైస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ బండ్ల గణేశ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. విశాఖను దోచుకుంటూ ఆ సంపదను హైదరాబాద్ కు తరలిస్తున్నారని, విష సాయి అని బండ్ల గణేశ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. కమ్మవారిని కులం పేరుతో తిట్టడం తగదని, చెల్లెల్ని అన్న నుంచి దూరం చేసిన దగుల్బాజీ అని విజయసాయిపై మండిపడ్డారు.

ఆ వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. ‘ఆకులు, వక్కలు.. పక్కలు.. ఇదేగా నీ బతుకు’ అంటూ మండిపడ్డారు. ఎవరిని పడితే వాళ్లను కరవడం అంతే ఈజీ అనుకున్నావా? అంటూ ఎద్దేవా చేశారు. ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావంటూ ఫైర్ అయ్యారు. ‘‘మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లు అవుతాయిగానీ.. బండ్లు ఓడలు కాలేవు. అయ్యో.. గణేశా!’’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/