తెలంగాణ విద్యాశాఖను భయపెడుతున్న ఏపీ కరోనా కేసులు

కరోనా వల్ల గత ఏడాదిన్నరగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆన్లైన్ క్లాస్ లు నడుస్తున్నప్పటికీ పెద్దగా వర్క్ అవ్వడం లేదు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుముఖం పట్టడం తో విద్యాసంస్థలు ఓపెన్ చేయాలనీ తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. సెప్టెంబర్ 01 నుండి అంగన్వాడి నుండి పీజీ వరకు ఓపెన్ చేయాలనీ ఆదేశించారు. ఈ ఆదేశాలతో అన్ని స్కూల్స్ , కాలేజీలు సిద్ధం అవుతున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ విద్యాశాఖ కు కొత్త భయం వెంటాడుతుంది.

రీసెంట్ గా ఏపీలో విద్యాసంస్థలు పున:ప్రారంభం అయ్యాయి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటం ఆందోళనలకు గురిచేస్తోంది. తాజాగా.. ప్రకాశం జిల్లాలో 14 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. అక్టోబరులో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.., చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుండడం తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను కలవరపెడుతోంది. ఈ కేసులు తెలంగాణ విద్యాశాఖ ను , పిల్లల తల్లిదండ్రులను భయపెడుతుంది. ఏపీలో మాదిరిగానే ఇక్కడ కూడా కేసులు పెరిగితే ఎలా అని ఆలోచనలో పడ్డారు. పాఠశాలల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ..పిల్లల తల్లిదండ్రుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. మరి విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో ..స్కూల్స్ ఓపెన్ చేస్తారో..లేక మరోసారి ఆలోచన చేస్తారో చూడాలి.