వాల్తేర్ వీరన్న..వాల్తేర్ శ్రీనా..? ఏది మెగా టైటిల్..?

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. తన వయసు తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలకు సెట్స్ పైకి తీసుకొచ్చిన చిరు..మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. మెహర్ రమేష్ డైరెక్షన్లో వేదాళం రీమేక్ భోళా శంకర్ తో పాటు బాబీ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు. రీసెంట్ గా మెగాస్టార్ బర్త్ డే రోజు ఈ చిత్ర టైటిల్ ప్రకటించకుండా జస్ట్ పోస్టర్ మాత్రమే విడుదల చేసారు. అయితే విడుదల చేసిన పోస్టర్ బట్టి చూస్తే ఈ మూవీ కథ విశాఖ నగరానికి చెందిన కథగా అర్ధమవుతుంది.

విశాఖ లోని మత్స్యకారుల నేపథ్యంలో మాస్ స్టోరీని బాబీ ఎంపిక చేసుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాల్తేర్ కి చెందిన వీరన్న కథను బాబి రాసుకున్నారట. అయితే ఇప్పుడు వీరన్న టైటిల్ మారుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. వాల్తేర్ వీరన్న కాస్తా వాల్తేర్ శీనుగా మార్చారని కథనొలొస్తున్నాయి. మరి ఫైనల్ గా చిత్ర టైటిల్ కు వాల్తేర్ వీరన్న పేరు ఖరారు చేస్తారా లేక వాల్తేర్ శీను అని ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి. చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తి కాగానే బాబీతో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ మూవీ ని నిర్మిస్తుంది.