వైఎస్‌ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సిఎం జగన్‌

CM Jagan released YSR Rythu Bharosa funds

అమరావతిః సీఎం జగన్‌ రెండో విడతగా “వైఎస్‌ఆర్ రైతు భరోసా” నిదులను విడుదల చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు రూ. 2200 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నామని… 53 లక్షల 53 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం చేసినట్లు వివరించారు.

రైతులు ఇబ్బందులు పడకూడదనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోందన్నారు. కేంద్రం పీఎం కిసాన్‌ డబ్బులు కూడా ఈ నెలలోనే వస్తాయని చెప్పారు. నేడు అందిస్తున్న రూ.4,000 సాయంతో కలిపి మన ప్రభుత్వం కేవలం ఒక్క రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకం ద్వారా మాత్రమే ఇప్పటి వరకు ఒక్కో రైతన్నకు అందించిన మొత్తం సాయం రూ. 65,500 అన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని జగన్‌ వివరించారు.