ప్రతిభ గల డైరెక్టర్స్ కు శంకర్ ఛాన్స్

లాక్ డౌన్ దెబ్బ చిత్రసీమలో పెనుమార్పులు తీసుకొచ్చింది. అప్పటి వరకు వెబ్ సిరీస్ లపై ఎవరికీ పెద్దగా ఇంట్రస్ట్ ఉండేది కాదు. కానీ లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడడం తో సినీ ప్రేక్షకులతో పాటు దర్శకులు, నిర్మాతలు , నటి నటులు సైతం వెబ్ సిరీస్ లపై మక్కువ పెంచుకున్నారు. కేవలం నటించడమే కాదు నిర్మించేందుకు కూడా పోటీపడుతున్నారు. తాజాగా అగ్ర దర్శకులైన శంకర్ – మణిరత్నం లు కలిసి రెయిన్‌ ఆన్‌ ఫిలిమ్స్‌ ప్రైవేట్​ లిమిటెడ్​ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

ఈ సంస్థలో సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను నిర్మించబోతున్నారు. ప్రతిభ ఉన్న దర్శకులకు అవకాశాలు కల్పించడం కోసం ఈ సంస్థను మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఈ సంస్థలో శంకర్ , మణిరత్నం లు మాత్రమే కాదు వెట్రిమారన్‌, గౌతమ్‌ మేనన్‌, లింగుస్వామి, మిస్కిన్‌, శశి, వసంత బాలన్‌, లోకేష్‌ కనగరాజ్‌, బాలాజీ శక్తివేల్‌, మురుగదాస్‌ తదితరులు కూడా భాగం అవుతున్నారు. ఇక ఈ సంస్థలో మొదటి చిత్రాన్ని లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.