గతంలో కనిపించిన వైరస్ తో పోలిస్తే భిన్నం !

తీరు మార్చుకున్న కరోనా ..చైనాలో కొత్త కేసుల ద్వారా వెల్లడి

corona virus
corona virus

చైనా: కరోనా వైరస్‌ తన తీరు మార్చుకుని మరింత బలపడింది. చైనాలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లోని వైరస్, గతంలో కనిపించిన వైరస్ తో పోలిస్తే భిన్నంగా ఉందని డాక్టర్లు గుర్తించారు. తాజాగా ఉత్తర ప్రావిన్స్ లోని జిలిన్, హీలాంగ్ జియాంగ్ తదితర ప్రాంతాల్లో సోకుతున్న వైరస్ శరీరంలో చాలాకాలం పాటు పాతుకుపోతున్నదని, వారు కోలుకునేందుకు మరింత సమయం పడుతోందని వైద్య నిపుణుడు క్వి హైబో వెల్లడించారు. ఈ వైరస్ సోకిన వారిలో చాలా కాలం పాటు ఎటువంటి లక్షణాలూ బయటపడటం లేదని, ఈలోగానే ఎంతో మందికి వైరస్ సోకుతోందని ఆయన అన్నారు. ఈ కొత్త వైరస్ సోకిన వారిలో అత్యధికులకు ఊపిరి తిత్తులకు చెందిన సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానించిన హైబో, వోహాన్ లో బయటకు వచ్చిన వైరస్ తో రోగులు గుండె, కిడ్నీ, పేగు సంబంధిత రుగ్మతలతో బాధపడ్డారని అన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/