దేశీయ విమానాయానం టికెట్‌ ధరలో నూతన విధానం

Union Minister Hardeep Singh Puri address a press conference

న్యూఢిల్లీ: మెట్రో నగరాల మధ్య 1/3 శాతం విమాన సర్వీసులు, నాన్‌ మెట్రో నగరాల మధ్య పూర్తి స్థాయి సర్వీసులు నడుపుతామని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశీయ విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నామన్నారు. విమాన టికెట్‌ ధరల విషయంలో నూతన విధానాన్ని అమలు చేస్తామన్నారు. అవి ఏడు కేటగిరీలుగా ఉంటుందని ఆయన అన్నారు. ఈవిధానం మూడు నెలలపాటు అములులో ఉంటుంది. టికెట్‌ ధర కనిష్టింగా రూ.3500 గరిష్టంగా రూ.10 వేలు ఉండాలి. కాగా మూడు నెలల తరువాత ధరల నిర్ణయంపై సమీక్ష జరుగుతుందన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/