‘అమెరికాలో కరోనా తగ్గుముఖం’

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడి

'అమెరికాలో కరోనా తగ్గుముఖం'
Donald Trump

అమెరికాలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కొత్తగా నవెూదవుతున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా పడిపోయిందన్నారు.

దేశంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షకు చేరువవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కరోనా కట్టడి చర్యల్ని పర్యవేక్షిస్తున్న ‘వైట్‌ హౌజ్‌’ అధికారి డెబోరా బిర్‌క్స ఇటీవల మాట్లాడుతూ.. కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య 50శాతానికి తగ్గిందని వెల్లడించిన విషయం తెలిసిందే.

అమెరికాలో ఇప్పటి వరకు 16,77,356 కేసులు నవెూదయ్యాయి. వీరిలో 98,024 మంది మృత్యువాతపడగా.. 3,41,718 మంది కోలుకున్నారు.

మరో 12,37,614 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ ముప్పు నుంచి తప్పించుకోవడానికి తాను తీసుకున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)ను వాడడం ఆపేసినట్లు ట్రంప్‌ తెలిపారు.

ఈ యాంటీ మలేరియా మందును రెండు వారాల పాటు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని.. హెచ్‌సీక్యూ వాడిన లక్ష్యం నెరవేరిందని అన్నారు.

ఈ ఔషధం వల్ల దుష్పభ్రావాలు ఉంటాయని అనేక మంది హెచ్చరించి నప్పటికీ.. ట్రంప్‌ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇప్పటికీ కరోనా చికిత్సలో హెచ్‌సీక్యూ వాడకాన్ని సమర్థిస్తున్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/