భారత్ లో రోజుకు 3లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు

మొత్తం కేసుల సంఖ్య 1,62,63,695

corona cases in India
corona cases in India

New Delhi: ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారత్ లో గురువారం 3లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం వరుసగా రెండోసారి 3లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,62,63,695కు పెరగ్గా.. ఇప్పటి వరకు 1,36,48,159 మంది కోలుకున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/