హైటెక్‌ సిటీ మైండ్‌స్పేస్‌లో కరోనా కలవరం

ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న పలు కంపెనీలు

Coronavirus effect on IT companies
Coronavirus effect on IT companies

హైదరాబాద్‌: నగరంలోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని రహేజా మైండ్ స్పేస్ లో కరోనా కలకలం రేపుతోంది. ఇందులోని బిల్డింగ్ నంబర్ 20లో ఉన్న ఐటీ కంపెనీ (డీఎస్ఎం సంస్థ)లో పని చేస్తున్న ఒక ఉద్యోగినికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అక్కడ పని చేస్తున్న ఉద్యోగులంతా బెంబేలెత్తిపోతున్నారు. కరోనా అలజడి నేపథ్యంలో అక్కడి కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలను జారీ చేస్తున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/