కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ట్రైలర్ ఎలా ఉందంటే..

బింబిసార తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ..ఇప్పుడు అమిగోస్ మూవీ తో ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా అషికా రంగనాథ్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో హీరో కల్యాణ్ రామ్ మూడు పాత్రల్లో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలు , టీజర్, బాలయ్య నటించిన ధర్మ క్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. అంటూ సాగే రీమిక్స్ సాంగ్ ఇలా అన్ని కూడా సినిమా ఫై అంచనాలు పెంచాయి.

ఇక శుక్రవారం సినిమా తాలూకా అసలైన ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ ఎలా ఉందనేది చూస్తే.. ముగ్గురిలో ఒకరు ఇండియన్ పాబ్లో ఎస్కోబార్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. అతడిని పోలిన వ్యక్తులు మరో ఇద్దరు ఉంటారు. ఒకరి గాళ్ ఫ్రెండ్ అయితే… ముగ్గుర్ని చూసి కన్‌ఫ్యూజ్ అవుతుంది. ముగ్గురిలో ఒకరు మిగతా ఇద్దరినీ తన ఇంటికి తీసుకు వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? ‘రాక్షసుడిని తీసుకొచ్చి ఇంటిలో పెట్టావ్ కదరా!’ అని తండ్రి తిడతాడు. ఆ తర్వాత ఏమైంది? తనలా ఉన్న మరో ఇద్దరినీ ఒకరు ఎందుకు చంపాలని అనుకున్నారు? చీకట్లో ఉన్న ఆ డెవిల్ ఎవరు? నేషనల్ సెక్యూరిటీ చీఫ్ బిపిన్ అనే అతడిని చూసి ఎందుకు భయపడుతున్నారు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి.

”నేను ఎవరినీ బెదిరించను. ఐ జస్ట్ కిల్” అని చివరిలో కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్… ముగ్గురిలో మృగం లాంటి ఒకరి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసింది. ”మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే అరిష్టం” అనే డైలాగ్ కథలో ఇంకేదో ఉందనే హింట్ ఇస్తోంది. ”సోమాలియా కరువు బాధితుడిలా ఆ ఆకలి చూపులు ఏంట్రా? తినేస్తావా ఆ పిల్లను” అని బ్రహ్మాజీ అడగటం చూస్తుంటే… కామెడీ, రొమాంటిక్ ట్రాక్ కూడా ఉందని అనిపిస్తోంది. అలాగే కల్యాణ్ రామ్ ఈ మూవీతో హీరోగా ఫ్రెండ్ గా విలన్ గా మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించినట్టుగా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. సినిమా చూసేలోపు..ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video