ఫార్మా కంపెనీల సీఈవోలతో ట్రంప్‌ భేటి

TRUMP- CEOs of pharma companies
TRUMP- CEOs of pharma companies

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ నేపథ్యంలో పది దిగ్గజ ఫార్మా కంపెనీల సీఈవోలతో వైట్‍హౌస్‍లో భేటీ అయ్యారు. అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి టీకా తయారీ దిశగా తమ దేశ ఔషధ కంపెనీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని ట్రంప్‍ తెలిపారు. టీకా తయారీకి సంయుక్త వ్యూహంతో సాగాలని వారికి సూచించారు. టీకా అభివృద్ధిలో ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్‍ తెలిపారు. కరోనా బాధిత దేశాల పరిస్థితిపై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/