సినిమా థియేటర్స్ పై కరోనా ఎఫెక్ట్‌.. కలెక్షన్లు నిల్‌

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా

corona-virus-effect-on-film-industry-box-office-collections-nil
corona-virus-effect-on-film-industry-box-office-collections-nil

హైదరాబాద్‌: కరోనా ఎఫెక్ట్‌ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తుంది. చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. కేవలం కరోనా వైరస్‌ చైనా దేశాన్నే కాదు..ప్రపంచ దేశాలను సైతం వణికిస్తుంది. గతం వారం రోజుల నుంచి మనదేశంలో పలు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జనాల్లో ఒక రకమైన అభద్రత భావం నెలకొంది. ఈ ఎఫెక్టు స్టాక్‌ మార్కెట్‌లపైనే కాదు..షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్స్‌, మల్టీపెక్స్‌ల పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో చాలా మాల్స్‌తో పాటు థియేటర్స్‌ ఇపుడు ఖాలీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా చైనా దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లు క్టోజ్‌ చేశారు. అంతేకాదు కొత్త సనిమాల విడుదలను కూడా ఆపేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/