కట్ట తెగిన అప్పా చెరువు- వరద ఉధృతిలో ముగ్గురు మృతి
పది వాహనాలు గల్లంతు?

Hyderabad: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరవాసులు బిక్కుబిక్కు మంటున్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ వద్ద అప్ప చెరువు భారీ వర్షానికి తెగిపోవడంతో వరదనీరు రోడ్డుపై ప్రవహిస్తుంది.
ఆయా ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీరు దీనికి తోడు కావడంతో వరద బీభత్సం కొనసాగుతూ ఉంది .
దీంతో హైదరాబాద్ షాద్ నగర్, శంషాబాద్ ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఉదయం బయలుదేరి వెళ్లిన వాహనాలను శంషాబాద్ వద్ద పోలీసులు నిలిపివేశారు.
అదే విధంగా ఈ వరదలో ముగ్గురు దుర్మరణం చెందారని స్థానికులు సమాచారం ఇచ్చారు. అలాగే ఈ వరదలో మరో పది వాహనాలు కొట్టుకుపోయినట్లు గా స్థానికులు చెబుతున్నారు.
సంఘటనా స్థలానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమొయి కుమార్ బయల్దేరారు.
నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్ మెట్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది.అత్యవసర సేవల కోసం జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/