డీజే టిల్లు 2 నుండి అనుపమ ఫస్ట్ లుక్ రిలీజ్

నేడు అనుపమ బర్త్ డే. ఈ సందర్బంగా డీజే టిల్లు 2 నుండి ఆమె తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు మేకర్స్. సిద్దు – నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఈ సినిమా కు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించిన మేకర్స్..తాజాగా సీక్వెల్ ను మొదలుపెట్టారు. సీక్వెల్ లో నేహా శెట్టి కి బడులు అనుపమ ను తీసుకున్నారు. ఆ మధ్య అనుపమ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో తేల్చినట్లు అయ్యింది.

ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే..ఈ పోస్టర్‌లో అనుపమ నోస్‌ పిన్‌ పెట్టుకుని అందంగా కనిపించి ఆకట్టుకుంటోంది. ఫస్ట్ పార్ట్ లో ‘రాధిక’ను గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంతకుముందు సినిమా ప్రకటన సందర్భంగా రిలీజ్ చేసిన చిన్న వీడియో కూడా విశేషంగా ఆకట్టుకుంది. తొలి పార్ట్ నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ.. డీజే టిల్లు స్క్వేర్ కూడా తీస్తోంది.