ఐశ్వర్యారాయ్ , ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్

రెండో టెస్టులో వారిరువురికీ పాజిటివ్ నిర్ధారణ

Aishwarya Rai, Aradhya
Aishwarya Rai, Aradhya

Mumbai : బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు.

ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

తొలుత చేసిన పరీక్షల్లో ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకు నెగటివ్ రాగా, రెండో టెస్టులో వారిరువురికీ కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/