ఏపీలో 30 వేల కరోనా కేసులు

24 గంటల్లో కొత్తగా 1,993 మందికి పాజిటివ్

corona cases updates in AP
corona cases updates in AP

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మమమ్మారి వ్యాప్తి అంతకంతకూ తీవ్రతరమౌతున్నది.

గత 24 గంటలలో కొత్తగా 1933 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 1914 మంది ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 18 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఒకరు ఉన్నారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29, 169కి చేరుకుంది. ఇక గత 24 గంటల్లో కరోనా కారణంగా 19 మంది చనిపోయారు.

దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య  328కి చేరుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/