వర్చువల్‌ విధానంలో క్రీడా పురస్కారాల అందజేత

President-Ramnath-Kovind

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అథ్లెట్లకు క్రీడా పురస్కారాలు అందజేశారు. ప్రతి ఏడాది ఢిల్లీలోని సా§్‌ు కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానిన్న కరోనా వ్యాప్తి కారణంగా వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. మొత్తం 65 మంది అథ్లెట్లకు అవార్డులు ప్రటించారు. వర్చువల్ విధానంలో… ఒకే సమయంలో దేశవ్యాప్తంగా బెంగళూరు, పుణె, సోనేపట్, చండీగఢ్, కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, ముంబై, భోపాల్, హైదరాబాద్, ఈటానగర్‌లో ఒకేసారి జరిగింది. ఈసారి ఖేల్ రత్న అవార్డును పారా అథ్లెటిక్స్‌లో టి.మరియప్పన్‌కి ప్రజెంట్ చేశారు. అలాగే హాకీలో రాణి, టేబుల్ టెన్నిస్‌లో మనిక బత్రాకు ప్రజెంట్ చేశారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో ద్రోణాచార్య అవార్డును ధర్మేంద్ర తివారీ (ఆర్చరీ), పురుషోత్తం రాయ్ (అథ్లెటిక్స్), శివ సింగ్ (బాక్సింగ్), రొమేష్ పథానియా (హాకీ), క్రిషన్ కుమార్ హుడా (కబడ్డీ), విజయ్ బాలచంద్ర మునీశ్వర్ (పారా పవర్ లిఫ్టింగ్), నరేష్ కుమార్ (టెన్నిస్), ఓమ్ ప్రకాష్ దహియా (రెజ్లింగ్)కి వర్చువల్‌లో బహుకరించారు.

అర్జున అవార్డును అతను దాస్ (ఆర్చరీ), ద్యుతీ చంద్ (అథ్లెటిక్స్), చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి (బాడ్మింటన్), వపినేష్ బృగవంశీ (బాస్కెట్‌బాల్), సుబేదార్ మనీష్ కౌశిక్ (బాక్సింగ్), లవ్లీనా బార్గోహైన్ (బాక్సింగ్), ఇషాంత్ శర్మ (క్రికెట్), దీప్తి శర్మ (క్రికెట్), దత్తు బదన్ భోకానల్ (రౌలింగ్), మను భాకెర్ (షూటింగ్), సౌరభ్ చౌదరి (షూటింగ్), మధురిక సుహాస్ పట్కర్ (టేబుల్ టెన్నిస్), దివిజ్ శరణ్ (టెన్నిస్)కి వర్చువల్‌లో బహుకరించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/