దేశంలో కొత్తగా 96,551 మందికి కరోనా

మొత్తం 45 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

corona tests
corona tests

New Delhi: దేశంలో క‌రోనా కేసులు, మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది.

కేంద్ర ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట వెలువరించిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 96,551 మందికికొత్తగా కరోనా సోకింది.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,62,415కు చేరింది. గ‌త 24 గంట‌ల్లో సమయంలో 1,209 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 76,271కు పెరిగింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/