రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

నాలుగు గేట్లు ఎత్తివేత

Srisailam reservoir
Srisailam reservoir

Srisailam: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో  ప్రాజెక్టు 4 గేట్లను 10 అడుగల మేర ఎత్తి నీటిని కిందకు వదులు తున్నారు. 

ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,98,239 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,42,700 క్యూసెక్కులుగా ఉంది.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 884.80 అడుగుల మేర నీరు ఉంది.

ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 214.8450 టీఎంసీలకి చేరిన నీటిమట్టం ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news