ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్

హస్తినలో ఆందోళన

Corona Positive To Pizza Delivery Boy In Delhi

New Delhi: ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హస్తినలో ఆందోళన నెలకొంది.

ఆ పిజ్జా డెలివరీ బాయ్ దాదాపు వంద కుటుంబాలకు పిజ్జా డెలివరీ చేసి ఉంటాడని అంచనా వేస్తున్నారు.

అతను పిజ్జా డెలివరీ చేసిన కుటుంబాల వారందరినీ అధికారులు క్వారంటైన్ చేశారు.

అలాగే ఆ పిజ్జా డెలివరీ బాయ్ తో పని చేసే మిగిలిన పిజ్జా డెలివరీ బాయ్స్ ను కూడా క్వారంటైన్ కు తరలించారు. ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలోని ప్రముఖ రెస్టారెంట్ లో ఈ యువకుడు పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/