కాంగ్రెస్ సీనియర్ నేత వి హెచ్ కి పాజిటివ్

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

coronavirus positive
coronavirus positive

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లు భావిస్తున్నారు.. గత. 2 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు చేయడంతో కరోనా ఉన్నట్లు తేలింది. 

ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. . ఆయన కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

వీహెచ్‌ ఇటీవల ఎవరెవరిని కలిశారన్న విషయాలపై కూడా అధికారులు ఆరా తీసున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/