కరోనా కౌంట్ వరల్డ్ వైడ్ : 89లక్షలు దాటేసిన కేసులు

4లక్షల 67వేలకు చేరువైన మరణాలు

Corona Count Worldwide-89 Lakh Cases
Corona Count Worldwide-89 Lakh Cases

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వున్నది. ఈ ఉదయానికి ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 89లక్షల 22వేల 973కు చేరుకుంది.

కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4 లక్షల 66వేల 971కి పెరిగింది. కరోనా కేసుల నమోదులోనూ, కరోనా మరణాలలోనూ అగ్రరాజ్యం అమెరికా అగ్ర స్థానంలో కొనసాగుతుండగా ఆ తరువాతి స్థానంలో బ్రెజిల్ ఉంది.

మూడో స్థానంలో రష్యా, నాలుగో స్థానంలో ఇండియా ఉండగా, ఐదవ స్థానంలో బ్రిటన్ ఉంది.

దేశం              కరోనా కేసులు     మరణాలు

  • అమెరికా       23, 30,578    1,21,980
  • బ్రెజిల్            10,70,139       50,058
  • రష్యా            5,76,952         8,002
  • ఇండియా        4,11,773      13,281
  • బ్రిటన్      3,03,110      42,589        

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/