జో బైడెన్ అడ్వైజర్ కి కరోనా పాజిటివ్

బైడెన్ కు కూడా కరోనా పరీక్షలు

Corona positive to Biden Advisor
Corona positive to Biden Advisor

Washinton: అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్ సలహాదారుడు సెడ్రిక్ రిచ్ మండ్  కరోనా బారిన పడ్డారు. సెడ్రిక్ లో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది.

దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇటీవలే సెడ్రిక్ రిచ్ మండ్  బైడెన్ తో కలిసి పర్యటించడంతో అధికారులు  బైడెన్ కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

బైడెన్ కు కరోనా సోకలేదని పరీక్షల్లో తేలింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/