మోడీ గారూ మీ తల్లి త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నాను: రాహుల్ గాంధీ
తల్లీకొడుకుల మధ్య అనుబంధం వెలకట్టలేనిదన్న రాహుల్

న్యూఢిల్లీః ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసర్చ్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు బులెటిన్ ద్వారా వెల్లడించారు. అయితే, అనారోగ్యానికి గల కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు. మరోవైపు ఈ బాధకరమైన సమయంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు.
ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ… తల్లీకొడుకుల మధ్య అనుబంధం అన్నిటికీ అతీతమైనదని, వెలకట్టలేనిదని చెప్పారు. మోడీ గారూ ఈ కష్ట సమయంలో మీకు తన ప్రేమ, మద్దతు ఉంటుందని అన్నారు. మీ మాతృమూర్తి త్వరగా కోలుకుంటారని ఆకాంక్షస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవలే హీరాబెన్ 99వ పుట్టినరోజును జరుపుకోవడం విశేషం.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/news/business/