కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందనున్న కడియం

Kadiyam srihari

హైదరాబాద్‌: తెలంగాణ కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కడియం శ్రీహరికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్నటి వరకు ఆయన హోం ఐసొలేషన్ లోనే ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయనకు పరీక్షలు నిర్వహించగా… ఆయన పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందనున్నట్టు సమాచారం. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఆయన భార్య, కుమారుడు, పనిమనిషికి కూడా కరోనా సోకింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/