అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్

ambati rambabu
ambati rambabu

అమరావతి: ఏపి కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఈనేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా.. స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలుగు చూశాయి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్.. మరోసారి చేసిన పరీక్షలో అంబటికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా విషయం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/