తెలంగాణ ఆర్టీసి విషయంలో సజ్జనార్ మరో సంచలన నిర్ణయం..

పోలీస్ శాఖ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సజ్జనార్..ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని తన దూకుడు కనపరుస్తూ..ఆర్టీసీ ని లాభాల బాటలో తెచ్చేందుకు ట్రై చేస్తున్న సజ్జనార్ ..తాజాగా వివాహాది వేడుకలకు ఆర్టీసి బస్సులు బుక్ చేసుకునే విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

గతం లో వివాహాది వేడుకలకు ఆర్టీసి బస్సులు బుక్ చేసుకోవాలంటే ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉండేది. దానివల్ల చాలామంది ఆర్టీసీ కంటే ప్రవైట్ బస్సులపైనే ఆసక్తి కనపరిచేవారు. అయితే ఇప్పుడు డిపాజిట్ లేకుండానే బస్సులను బుక్ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ఆర్టీసి అందుబాటులోకి తీసుకువచ్చింది.

దీనికి సంబంధించి ఆర్టీసి గురువారం ట్వీట్ చేసింది. వేడుకల కోసం బస్సు కావాలనుకుంటే నేరుగా డిపో మేనేజర్ లను సంప్రదించాలని పేర్కొంది. ఇక ఆర్టీసి తీసుకున్న ఈ నిర్ణయం తో ఎప్పుడు కావాలంటే అప్పుడు బస్సును బుక్ చేసుకునే అవకాశం లభించింది. ఈ నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.